Sun Nov 17 2024 19:28:31 GMT+0000 (Coordinated Universal Time)
Tripura : భారీ వర్షాలకు 22 మంది మృతి
త్రిపురలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
త్రిపురలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరిగింది. వర్షాల వల్ల దాదాపు ఇరవై రెండు మంది చనిపోయినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. మరికొందరు గల్లంతయినట్లు చెబుతున్నారు. ఇక వర్షాల ధాటికి చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అశ్వని త్రిపుర పారా, దేబీపూర్ లో కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు పది మంది చనిపోయినట్లు చెబుతున్నారు.
ఆస్తి నష్టం...
వీరంతా శిధిలాల కింద చిక్కుకుపోయారు. ఇక పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. పశు సంపదకు కూడా భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెతిపారు. ఈ భారీ వర్షాల కారణంగా దాదాపు ఇరవై లక్షల మంది ప్రభావితులయ్యారని, అయితే సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి మాణిక్ సాహా తెలిపారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Next Story